Friday, 24 October 2014

karthikeya review


karthikeya review

English Full Review
What Is Good
కాన్సెప్ట్
సినిమాటోగ్రఫీ
సంగీతం
కొన్ని కామెడీ బిట్స్
What Is Bad
క్లైమాక్స్
చిత్రం చాలా నెమ్మదిగా సాగుతుంది
పాత్రలలో పరిపఖ్వత లేకపోవడం
పాటలు
Bottom Line:కార్తికేయ - దైవం - శాస్త్రజ్ఞం - విజయం ..

Karthikeya - చిత్ర కథ


కార్తీక్ (నిఖిల్) ఒక వైద్య విద్యార్థి , ఏదయినా రహస్యంగా ఉండి జనాన్ని భయపెడుతుంటే దాన్ని చేదించి ఆ ప్రశ్నకు జవాబు వెతకడం అతని నైజం, అతనికి వల్లి (స్వాతి) పరిచయం అవడంతో అతనికి అన్ని కలిసి వస్తు ఉంటాయి. చదువు పూర్తయిన కార్తీక్ మెడికల్ క్యాంపు కోసం అని సుబ్రహ్మణ్య పురం కి వెళతాడు..

పూర్వం కీర్తివర్మ అనే రాజు కట్టించిన గుడి కి ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి కార్తిక పౌర్ణమి నాడు ఆ గుడి మొత్తం ప్రకాశిస్తుంది.. సుబ్రహమణ్య పురం లోని గుడి కొన్ని అనివార్య కారణాల వలన మూసి వేయబడి ఉంటుంది ... ఆ గుడి తెరవాలని ఎవరు ప్రయత్నించినా వారు పాముకాటుకి గురయ్యి చనిపోతుంటారు.. ఇదే విషయం కార్తీక్ కి తెలుస్తుంది అసలు ఆ గుడి ఎందుకు మూతబడింది? దాని వెనుక ఉన్న కథేంటి? అన్న రహస్యాన్ని చేదించాలని నిర్ణయించుకుంటాడు కార్తీక్.. కార్తీక్ అనుకున్నది సాదించాడా? అన్నదే మిగిలిన కథాంశం ...

Karthikeya - నటీనటుల ప్రతిభ


నిఖిల్ నటనాపరంగా చాలా బాగా నటించారు కాని ఈ పాత్రకు కావలసినంత పరిపఖ్వత ఇతనిలో కనపడలేదు అంతే కాకుండా పాత్రను కూడా పూర్తిగా అభివృద్ధి చేయ్యకపోవడంతో కావలసినదాని కన్నా తక్కువ ప్రదర్శన కనబరిచిన ఫీలింగ్ కలుగుతుంది.. కథ మొత్తం రాసేసుకొని చివర్లో స్వాతి పాత్రను జోడించినట్టు అనిపిస్తుంది ఎందుకంటే కమెడియన్స్ సత్య మరియు ప్రవీణ్ పాత్రలు ఇమిడినంత కూడా స్వాతి పాత్ర కథలో ఇమడలేకపోయింది.. సత్య మరియు ప్రవీణ్ ల కామెడీ కొన్ని చోట్ల బాగా పేలింది, కిషోర్ పాత్ర చాలా బాగా ఉన్న కూడా ఈ నటుడు తన స్థాయిలో ఆకట్టుకున్నారు ఈ నటుడిని పూర్తి స్థాయిలో ఉపయోగించి ఉండాల్సింది. తనికెళ్ళ భరణి కొన్ని సన్నివేశాలలోనే కనిపించిన ఆ సన్నివేశాలకు సరిపడా ఇంట్రెస్ట్ అయన నటనతో సృష్టించారు.. జయప్రకాశ్ ప్రత్యేక పాత్రలో కనిపించి అలరించారు.. నిఖిల్ కి అమ్మ గా తులసి పాత్రకి తగ్గట్టు నటించారు జోగి బ్రదర్స్ పరవలేధనిపించారు..

Karthikeya - సాంకేతికవర్గం పనితీరు


ఈ చిత్రం చాలా సున్నితమయిన అంశాన్ని కథగా ఎంచుకుంది , ఇంతటి సున్నితమయిన అంశానికి కథనం కూడా సరిగ్గా కుదిరింది చివరి యాక్ట్ వరకు కూడా చిత్రం చాలా ఆసక్తికరంగా సాగుతుంది కాని చివరి యాక్ట్ లోచిత్రం పేలవంగా మారిపోయింది.. అతను రాసుకున్న మాటలు చాలా బాగున్నాయి ముఖ్యంగా "ప్రపంచలో ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది సమాధానమే లేకపోతే సమస్య ప్రశ్నది కాదు ప్రయత్నానిది" "గుండ్రంగా ఉండే భూమికి వాస్తు ఎంటండి" వంటి సిద్దాంతిక డైలాగ్స్ మాత్రమే కాకుండా "సస్పెన్స్ కి కామెడీ తోడయితే ఫార్ములా సూపర్ హిట్" "భయపడేవాడికి బిల్డప్ ఎందుకు రా " లాంటి హాస్యపూరితమయిన మాటలని కూడా రచించి ప్రేక్షకులను మెప్పించారు.. మొదటి చిత్రాన్ని దర్శకుడు ఇంత పరిపఖ్వతతో తెరకెక్కించడం ఆశ్చర్యకరం ... సినిమాటోగ్రఫీ అందించిన కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి ప్రధాన ప్లస్ కొన్ని సన్నివేశాలలో ఈయన సినిమాటోగ్రఫీ అద్భుతంగా కుదిరింది, చిత్రానికి కావలసిన మూడ్ ని సృష్టించండంలో ఈయన ప్రమేయం చాలా ఉంది .... సంగీతం అందించిన శేఖర్ చంద్ర పాటలు చాలా బాగున్నాయి కాని కథనానికి స్పీడ్ బ్రేకర్ లా అనిపించాయి అయన నేపధ్య సంగీతం చాలా బాగుంది చిత్రంలో ఉన్న సస్పెన్స్ ప్రేక్షకుడి దాకా చేర్చింది ఈయన సంగీతం.. గుడి గతం గురించి చెప్పడానికి ఉపయోగించిన గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి.. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది కొన్ని సన్నివేశాలు అనవసరంగా లాగినట్టు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.. ఇలాంటి చిత్రాన్ని నమ్మి తెరకెక్కించిన మాగ్నస్ సినీ ప్రైమ్ వారిని అభినందించి తీరాల్సిందే.....

Karthikeya - చిత్ర విశ్లేషణ


దైవం అనేది నువ్వు నమ్మితే యదార్థం నువ్వు నమ్మకపోతే యాదృచ్చికం అనే పాయింట్ తో కథను నడిపించాడు దర్శకుడు. అస్తికత్వానికి నాస్తికత్వానికి మధ్యన ఉన్న చిన్న గీత గురించి ఈ చిత్రంలో చర్చించారు. దైవానికి శాస్త్రాన్ని జత చేస్తే జ్ఞానం ఒక్కోసారి అదే మనం పిలుచుకునే మూడ నమ్మకం అని చెప్పడానికి ప్రయత్నించారు దర్శకుడు చందూ మొండేటి. ఇలాంటి కాన్సెప్ట్ ని డీల్ చెయ్యడం అంత సులభం ఏమి కాదు కాని దర్శకుడు ఎంచుకున్న పాయింట్ దాన్ని డీల్ చేసిన విధానం అది కూడా అతని మొదటి చిత్రానికే ఇంతటి పరిపఖ్వతతో కూడిన ప్రతిభ చూపించడం నిజంగా చాలా మంచి విషయం. ఈ చిత్రంలో లోపాలు లేవని కాదు ఉన్నాయి.. చిత్రం ఎంత ఆసక్తికరంగా ఉన్నా కథ మాత్రం చాలా నెమ్మదిగా సాగుతుంది.. ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన కథ చివర్లో తారస్థాయి చేరుకోవాలి కాని ఈ చిత్రం చివడ్డుకున్నాయి.. ప్రపంచంలో జవాబులేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి అందులో తెలుగులో విభిన్న చిత్రం చెయ్యడం కూడా ఒకటి .. చూస్తుంటే నిఖిల్ కి జవాబు దొరికేసినట్టు కనిపిస్తుంది తన గత చిత్రం స్వామి రారా మరియు ఈరి మెట్టులో ఆగిపోతుంది.. పాటలు చూడటానికి వినడానికి చాలా అందంగా ఉన్నా కథా ప్రయాణాన్ని అ చిత్రం మాములుగానే ఉన్నా విభిన్న చిత్రం చూసాం అన్న భావన కలిగిస్తాయి. నిఖిల్ ఇటువంటి చిత్రాలు చెయ్యడమే అతనికి మంచిది "ఎవరో నిరూపించింది ప్రయత్నించడం కాదు ఎవరూ ప్రయత్నించనిది నిరూపించు" అన్న డైలాగ్ ఉంది చిత్రంలో ఈ చిత్రంతో నిఖిల్ చేస్తున్నది కూడా అదే కాని అతను మరియు దర్శకుడు వారి తరువాతి చిత్రాలలో కథనాన్ని కాస్త వేగంగా సాగేలా చూసుకోవాలి దర్శకుడు పాత్రలను పూర్తిగా అభివృద్ధి చేసుకోవడం మీద దృష్టి సారించాలి.

ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని అందించిన సినిమాటోగ్రఫీ మరియు శేఖర్ చంద్ర అందించిన సంగీతం మరియు నేపధ్య సంగీతం పెద్ద ప్లస్ అయ్యాయి.. కాన్సెప్ట్ ని ఆసక్తికరంగా ఉంచడంలో ఎప్పటికప్పుడు వీరిద్దరూ ప్రధాన పాత్రలు పోషించారు.. ఈ చిత్రంలో ఎక్కడా కూడా ప్రేక్షకుడు కథ నుండి బయటకి వెళ్ళడు అంత పగడ్భందీగా రాసుకున్నారు కథనాన్ని.. ఈ చిత్రం చివర్లో వచ్చే ఒక శ్లోకం "సాధనాత్ సాధనే సర్వం" నిజమే సాధనతో సాధన చేస్తేనే ఏదయినా సాదించవచ్చు ఇలానే దర్శకుడు మరియు నిఖిల్ సాధన చేస్తే ఇలాంటి చిత్రాన్నే లోపాలు లేకుండా సాదించగలరు.. విభిన్నమయిన చిత్రాలను ఆశించేవారు తప్పకుండా చూడవలసిన చిత్రం ఇది..

Karthikeya - కాస్ట్ అండ్ క్రూ
Karthikeya Telugu Movie Review | Live Updates, Story, Talk 
24/10/2014

4.5 out of 5
based on 11,56,267

Title : కార్తికేయ : రివ్యూ
Star Cast : Nikhil Siddharth, Swati Reddy
Producer : Venkat Srinivas Boggaram
Director : Chandoo Mondeti
Music : Sekhar Chandra
Released on: 24-10-2014

0 comments:

Post a Comment

 
Related Posts Plugin for WordPress, Blogger...